మా స్వంత నిర్మాణ సంస్థలో కూడా నటించారు: జయప్రకాశ్ రెడ్డి మృతిపై విజయశాంతి స్పందన

  • నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత
  • 'సరిలేరు...' చిత్రంలో ఆయనతో కలిసి నటించానన్న విజయశాంతి
  • టాలీవుడ్ ఓ ప్రతిభావంతుడ్ని కోల్పోయిందని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణంపై ప్రముఖ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని తెలిపారు. రంగస్థలం మీద, వెండితెర పైన తనదైన ప్రత్యేకశైలిలో నటన, వాచకం, విభిన్నమైన పాత్రలతో ఎందరో అభిమానులను జయప్రకాశ్ రెడ్డి మెప్పించారని కొనియాడారు. జయప్రకాశ్ రెడ్డి తమ స్వంత నిర్మాణ సంస్థలోనూ 3 సినిమాలు చేశారని విజయశాంతి వెల్లడించారు.

జయప్రకాశ్ రెడ్డితో చివరిగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటించానని, వారి విలక్షణ నటన చిరకాలం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని విజయశాంతి ట్వీట్ చేశారు.

Vijayashanti
Jayaprakash Reddy
Death
Tollywood

More Telugu News